‘తెలంగాణ’ లాంటి పుణ్యభూమిపై అడుగుపెట్టే అవకాశం దక్కింది: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా

  • రజాకార్లతో పోరాడి గెలిచిన గడ్డ ‘తెలంగాణ’
  • దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే సత్తా బీజేపీకే ఉంది
  • అందుకే చాలా మంది మా పార్టీలో చేరుతున్నారు
తెలంగాణ లాంటి పుణ్యభూమిపై అడుగుపెట్టే అవకాశం తనకు దక్కినందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అన్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, రజాకార్లతో పోరాడి గెలిచిన గడ్డపై అడుగుపెట్టానని, వారికి వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే సత్తా కేవలం బీజేపీకే ఉందని అన్నారు. బీజేపీలో ఉన్న ప్రజాస్వామ్యం ఇతర ఏ పార్టీలోనూ లేదని, అందుకే, తమ పార్టీలో చేరే వారి సంఖ్య ఎక్కువైందని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో పని చేసేందుకు చాలా మంది నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ‘నేను, నా తర్వాత నా కుమారుడు.. ’ అనే ధోరణి బీజేపీ మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఉందని విమర్శించారు.
Go Back to Shorts
Telangana
cm
kcr
bjp
working president
jp

More Telugu News